మ‌రోసారి పోలీస్‌గా శ‌ర్వా!!

ABN , First Publish Date - 2020-07-03T15:46:53+05:30 IST

‘రాధ’ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించిన శ‌ర్వానంద్ మ‌రోసారి పోలీసు పాత్ర‌లో మెప్పించ‌నున్నారు.

మ‌రోసారి పోలీస్‌గా  శ‌ర్వా!!

‘రాధ’ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించిన శ‌ర్వానంద్ మ‌రోసారి పోలీసు పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. వివ‌రాల్లోకెళ్తే ..శ‌ర్వానంద్‌తో గ‌తంలో ‘ర‌న్ రాజా ర‌న్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ  యువీ క్రియేష‌న్స్ మ‌రో సినిమా ప్లాన్ చేసింది. శ్రీరామ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారట‌. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే యువీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో శ‌ర్వా కొత్త ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. 

Updated Date - 2020-07-03T15:46:53+05:30 IST