న‌వంబ‌ర్‌లో షురూ చేస్తున్న షారూక్‌..!

ABN , First Publish Date - 2020-10-14T22:00:00+05:30 IST

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ త‌దుప‌రి సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

న‌వంబ‌ర్‌లో షురూ చేస్తున్న షారూక్‌..!

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ త‌దుప‌రి సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారూక్ గ‌త చిత్రం ‘జీరో’ విడుద‌లై రెండేళ్లు అవుతుంది. ఈ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో షారూక్ ‘ప‌ఠాన్‌’ చిత్రాన్ని ఓకే చేయ‌డానికి చాలా స‌మ‌య‌మే తీసుకున్నారు. ఎట్టకేలకు షారూక్ తన నెక్ట్స్ మూవీ ‘ప‌ఠాన్‌’ త్వర‌‌‌లోనే సెట్స్‌పైకి రానుంది. ఇందులో జాన్ అబ్ర‌హం, దీపికా ప‌దుకొనె కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. న‌వంబ‌ర్ నుండి సినిమా సెట్స్‌పైకి రానుందని టాక్‌. అయితే ముంబై స్టూడియోలో తొలి షెడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ని, అందులో షారూక్ మాత్ర‌మే పాల్గొంటార‌ట‌. దీపికా ప‌దుకొనె, జాన్ అబ్ర‌హంలు వ‌చ్చే ఏడాది విదేశాల్లో జరగ‌బోయే షెడ్యూల్‌లో జాయిన్ అవుతార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. 

Updated Date - 2020-10-14T22:00:00+05:30 IST