బాలయ్య, బోయపాటి చిత్రంలో సీనియర్‌ నటి

ABN , First Publish Date - 2020-09-28T04:05:58+05:30 IST

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ చిత్రానికి సంబంధించి విడుదలైన

బాలయ్య, బోయపాటి చిత్రంలో సీనియర్‌ నటి

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌.. ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలియజేసింది. ఇక కరోనా కారణంగా చిత్ర షూటింగ్‌కి బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. త్వరలో సెట్స్‌ పైకి వెళ్లేందుకు బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. సరైన క్లారిటీ మాత్రం లేదు. కానీ ఈ సినిమాపై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటి రోజా నటిస్తుందంటూ ఆ మధ్య వార్తలు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.


ఇప్పుడు రోజా స్థానంలో మరో సీనియర్ నటి పేరు వినబడుతుంది. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు? నటి, రాజకీయ నాయకురాలైన జయప్రద. బీబీ3లో ఓ కీలకపాత్ర చేసేందుకు బోయపాటి జయప్రదను సంప్రదించారని, అందుకు ఆమె అంగీకరించారని తాజాగా సోషల్‌ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. అల్రెడీ బాలయ్య  'మహారథి' చిత్రంలో జయప్రద చేశారు. మరోసారి బాలయ్య చిత్రంలో, ఓ కీలకపాత్రలో ఆమె చేస్తుందనే వార్త మరి ఎంత వరకు నిజమో తెలియాలంటే బోయపాటి స్పందించాల్సిందే. 

Updated Date - 2020-09-28T04:05:58+05:30 IST