రవితేజతో సీరత్ కపూర్?

ABN , First Publish Date - 2020-09-16T21:27:12+05:30 IST

`రన్ రాజా రన్` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది సీరత్ కపూర్

రవితేజతో సీరత్ కపూర్?

`రన్ రాజా రన్` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది సీరత్ కపూర్. ఆ తర్వాత పలు సినిమాల్లో హాట్ హాట్ పాత్రల్లో మెరిసింది. ఈ లాక్‌డౌన్ సమయంలో `కృష్ణ అండ్ హిజ్ లీలా` సినిమా రూపంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 


మాస్ మహారాజ్ రవితేజ సరసన మరోసారి నటించే అవకాశం సీరత్‌కు వచ్చినట్టు తాజా సమాచారం. రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించనున్న `ఖిలాడీ` సినిమాలో హీరోయిన్‌గా సీరత్‌‌ను తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ, సీరత్ కలిసి గతంలో `టచ్ చేసి చూడు` సినిమాలో నటించారు. 

Updated Date - 2020-09-16T21:27:12+05:30 IST