బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్‌

ABN , First Publish Date - 2020-02-27T01:08:32+05:30 IST

ఘాజీ స‌క్సెస్‌తో అంద‌రి దృష్టిని ఆక్ట‌రించుకున్న ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి త‌దుప‌రి వ‌రుణ్‌తేజ్‌తో అంత‌రిక్షం సినిమాను తెర‌కెక్కించాడు.

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్‌

ఘాజీ స‌క్సెస్‌తో అంద‌రి దృష్టిని ఆక్ట‌రించుకున్న ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి త‌దుప‌రి వ‌రుణ్‌తేజ్‌తో అంత‌రిక్షం సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఆ సినిమా ఆశించిన మేర‌కు విజ‌యం సాధించ‌లేదు. దీంతో సంక‌ల్ప్ రెడ్డి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ డైరెక్ట‌ర్ ఈసారి ఏకంగా బాలీవుడ్‌లోనే సినిమా చేయ‌డానికి సిద్ధమైపోయాడని టాక్. గతంలో ద‌క్షిణాదిలో క‌త్తి.. ఎన్టీఆర్ శ‌క్తి..సూర్య‌తో సికింద‌ర్ సినిమాల్లో న‌టించిన బాలీవుడ్ న‌టుడు విద్యుజ‌మాల్‌తో సంక‌ల్ప్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని భారీ యాక్ష‌న్ మూవీని తెర‌కెక్కించేలా సంక‌ల్ప్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని టాక్‌. 


Updated Date - 2020-02-27T01:08:32+05:30 IST