వెబ్ సిరీస్‌లో సానియా?

ABN , First Publish Date - 2020-11-17T15:45:25+05:30 IST

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిగా మారనుందా? ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా

వెబ్ సిరీస్‌లో సానియా?

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటిగా మారనుందా? ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ఆటతోనే కాదు తన అందంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సానియా. ఈమె వెండితెర అరంగేట్రం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. 


ఇప్పటివరకు నటనపై పెద్దగా దృష్టి పెట్టని సానియా ఇక యాక్టింగ్‌నే కెరీర్‌గా మార్చుకోబోతోందట. వెండితెర గురించి ఇప్పటికి స్పష్టత లేకపోయినా బుల్లితెరపై మాత్రం మెరవనుందట. ఎమ్ టీవీలో ప్రసారం కాబోతున్న `నిషేద్ ఎలోన్ టుగెదర్` సిరీస్‌లో కనిపించనుందట. మొత్తం ఐదు ఎపిసోడ్‌లుగా ఇది ప్రసారం కాబోతోందట. ఈ నెల చివరి నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం.  

Updated Date - 2020-11-17T15:45:25+05:30 IST