టైటిల్‌ మార్చేసిన 'అర్జున్‌' రెడ్డి డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-22T01:12:24+05:30 IST

సందీప్ వంగా బాలీవుడ్ లో చేస్తున్న తదుపరి చిత్రం టైటిల్ మార్పుకు ఆలోచిస్తున్నాడట.

టైటిల్‌ మార్చేసిన 'అర్జున్‌' రెడ్డి డైరెక్టర్‌

అర్జున్‌ రెడ్డి సినిమాతో తెలుగులో క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇదే సినిమాను కబీర్‌సింగ్‌ పేరుతో హిందీలో రీమేక్‌ చేసి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. తదుపరి సినిమాను బాలీవుడ్‌లోనే రణభీర్‌ కపూర్‌తో స్టార్ట్‌ చేశాడు సందీప్‌ వంగా. ఈ చిత్రానికి డెవిల్‌ అనే పేరు పెట్టుకున్నాడు కూడా. అయితే ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చమని సందీప్‌ని అడిగారట. అందుకు కారణం సల్మాన్‌ 'కిక్‌' సినిమాకు రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట. ఈ సీక్వెల్‌కు సల్మాన్‌ 'డెవిల్‌' అనే టైటిల్‌ను అనుకున్నాడట. సల్మాన్‌ ఆల్‌రెడీ టైటిల్‌ ఫిక్స్‌ చేసుకుని ఉండటంతో సందీప్‌ సినిమాకు టైటిల్ మార్చమని నిర్మాతలు అనుకున్నారట. నిర్మాతల రిక్వెస్ట్‌ మేరకు సందీప్ తన సినిమాకు 'యానిమల్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట. 


Updated Date - 2020-12-22T01:12:24+05:30 IST