సందీప్‌తో చెర్రీ!

ABN , First Publish Date - 2020-08-04T16:28:48+05:30 IST

తొలి సినిమా `అర్జున్‌రెడ్డి`తోనే సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు వంగా సందీప్ రెడ్డి.

సందీప్‌తో చెర్రీ!

తొలి సినిమా `అర్జున్‌రెడ్డి`తోనే సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు వంగా సందీప్ రెడ్డి. అదే సినిమాను హిందీలోకి `కబీర్‌సింగ్`గా రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సందీప్ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కోసం ఓ కథను తయారు చేస్తున్నాడట. 


ఇప్పటికే చెర్రీకి సందీప్ స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. ఆ లైన్ చెర్రీకి బాగా నచ్చిందట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. `ఆర్ఆర్ఆర్` తర్వాత చెర్రీ చేయబోయే సినిమా గురించి రోజుకో అప్‌డేట్ బయటకు వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా సందీప్ పేరు తెర మీదకు వచ్చింది. మరి, చెర్రీ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-08-04T16:28:48+05:30 IST