సందీప్ రెడ్డికి మళ్లీ నిరాశేనా?

ABN , First Publish Date - 2020-02-18T22:37:59+05:30 IST

`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి.

సందీప్ రెడ్డికి మళ్లీ నిరాశేనా?

`అర్జున్‌రెడ్డి` సినిమాతో ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి. అదే సినిమాను హిందీలోకి `కబీర్‌సింగ్` పేరుతో రీమేక్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే `కబీర్‌సింగ్` తర్వాత సందీప్ రెడ్డి ఇప్పటివరకు మరో సినిమాను పట్టాలెక్కించలేదు. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాలని సందీప్ అనుకున్నాడు. కథ కూడా సిద్ధం చేశాడు. అయితే మహేష్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. 


ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు. కథ విని రణ్‌వీర్ కూడా ఓకే చెప్పేశాడు. టి-సిరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా ఆగిపోయినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే కారణాలేంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీంతో తెలుగు సినిమా చేయాలని సందీప్ అనుకుంటున్నాడట.  

Updated Date - 2020-02-18T22:37:59+05:30 IST