సందీప్‌ ఆ స్టార్ హీరోను ఒప్పించాడా?

ABN , First Publish Date - 2020-06-28T02:46:03+05:30 IST

తెలుగులో `అర్జున్‌రెడ్డి`తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

సందీప్‌ ఆ స్టార్ హీరోను ఒప్పించాడా?

తెలుగులో `అర్జున్‌రెడ్డి`తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాను హిందీలోకి `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ సాధించాడు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సందీప్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. మహేష్, రణ్‌వీర్ వంటి హీరోలకు సందీప్ కథలు చెప్పాడని, వారు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. 


తాజాగా సందీప్ తర్వాతి సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. సందీప్ దర్శకత్వంలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ అంగీకరించినట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కంటే ముందే రణ్‌బీర్‌తో సందీప్ చర్చలు జరిపినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతోందట. 

Updated Date - 2020-06-28T02:46:03+05:30 IST