సమంత దసరా తర్వాతే..?

ABN , First Publish Date - 2020-08-07T21:23:05+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత బాగా వినియోగించుకుంటోంది

సమంత దసరా తర్వాతే..?

లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని ప్రముఖ కథానాయిక సమంత బాగా వినియోగించుకుంటోంది. యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టింది. అలాగే తన ఇంటిపై వ్యవసాయం కూడా చేస్తోంది. వాటికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. సమంత చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. 


`ఫ్యామిలీ మేన్-2` వెబ్‌‌సిరీస్‌లో సమంత తీవ్రవాది పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. అలాగే సమంత తమిళంలో రెండు సినిమాలు అంగీకరించింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్-ఇండియా సినిమా, నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లోని సినిమా ప్రస్తుతం సమంత చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత ఆ సినిమా షూటింగ్‌లకు హాజరు కావాలని సమంత భావిస్తోందట. అప్పటికి కేసుల తీవ్రత తగ్గితే కచ్చితంగా షూటింగ్‌లకు హాజరు కావాలని సమంత అనుకుంటోందట. 

Updated Date - 2020-08-07T21:23:05+05:30 IST