కొత్తదనం కోసం రిస్క్ చేస్తున్న సమంత

ABN , First Publish Date - 2020-03-04T21:59:22+05:30 IST

నిన్న మొన్నటి వరకు తెలుగునాట స్పీడ్ చూపించిన సమంత ఇప్పుడు వేగం తగ్గించింది. కథల విషయంలో ఆచితూచి ముందుకెళ్తోంది. దీనితో నెమ్మదిగా ఈ అమ్మడి చేతిలో సినిమాలు తగ్గుతూ వస్తున్నాయి.

కొత్తదనం కోసం రిస్క్ చేస్తున్న సమంత

నిన్న మొన్నటి వరకు తెలుగునాట స్పీడ్ చూపించిన సమంత ఇప్పుడు వేగం తగ్గించింది. కథల విషయంలో ఆచితూచి ముందుకెళ్తోంది. దీనితో నెమ్మదిగా ఈ అమ్మడి చేతిలో సినిమాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే గ్యాప్ వచ్చినా.., పేరు తెచ్చి పెట్టే సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ 'బేబీ'. తాజాగా 'జాను'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా, నటిగా సామ్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతో ఓ హారర్ మూవీలో నటించబోతోందట అక్కినేని కోడలు. 


ముందు నుండి హారర్ థ్రిల్లర్ జానర్స్ సమంతకు పెద్దగా కలసి రావడం లేదు. 'రాజుగారి గది 2', 'యూ- టర్న్' సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయినా.. ఇప్పుడు సామ్ మరో తమిళ హారర్ మూవీ కమిటైందట. 'గేమ్ ఓవర్' మూవీ ఫేమ్ అశ్విన్ శరవణన్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్‌ని  సోని ఎంటర్ టైన్ మెంట్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతోందట. 

Updated Date - 2020-03-04T21:59:22+05:30 IST

Read more