పౌరాణిక పాత్రకు సమంత గ్రీన్‌ సిగ్నల్‌..?

ABN , First Publish Date - 2020-12-27T15:33:21+05:30 IST

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ రీసెంట్‌గా 'శాకుంతలం' అనే ప్యాన్‌ ఇండియా మూవీని రీసెంట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

పౌరాణిక పాత్రకు సమంత గ్రీన్‌ సిగ్నల్‌..?

సంచలన దర్శకుడు గుణశేఖర్‌ రీసెంట్‌గా 'శాకుంతలం' అనే ప్యాన్‌ ఇండియా మూవీని రీసెంట్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేయాలనుకున్న 'హిరణ్యకశ్యప' కంటే ముందు ఈ చిత్రం రూపొందించనున్నట్లుగా తెలుపుతూ.. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్నారు. వెస్ట్రన్‌ భాషల్లో అనువాదం అయిన భారతీయ నాటకాల్లో మొదటిది 'శాకుంతలం'.  1889లో ఈ నాటకం నార్వేజియన్‌, ఫ్రెంచ్‌, ఆస్ట్రియన్‌, ఇటాలియన్‌ వంటి 46 భాషలలోకి అనువాదం అయింది. ఇలాంటి ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారు? దుష్యంత మహారాజుగా ఎవరు నటిస్తారు? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే లేటెస్ట్‌ దీనిగురించి డైరెక్టర్‌ గుణశేఖర్‌ అండ్‌ టీమ్‌ ఓ అప్‌ డేట్‌ ఇచ్చింది. జనవరి మొదటివారంలో ఈ సినిమాకు సంబంధించిన తొలి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నామని తెలియజేసింది చిత్ర యూనిట్‌. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు శకుంతల పాత్రలో సమంత అక్కినేని నటించనున్నారని, దానికి సంబంధించిన అప్‌డేట్‌ రానుందని టాక్‌ వినిపిస్తోంది. 

Updated Date - 2020-12-27T15:33:21+05:30 IST