‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడికి నో చెప్పిన సమంత

ABN , First Publish Date - 2020-02-16T22:34:40+05:30 IST

ఆర్‌ఎక్స్ 100’ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత దర్శకుడు అజయ భూపతికి అవకాశాలు వెల్లువలా...

‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడికి నో చెప్పిన సమంత

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత దర్శకుడు అజయ భూపతికి అవకాశాలు వెల్లువలా వస్తాయనుకున్నారంతా, కానీ అలా జరగలేదు. చాలాకాలం నుంచి అజయ్ తను రాసుకున్న ‘మహాసముద్రం’ స్క్రిప్టుని పట్టుకొని చాలా మంది హీరోల వద్దకు వెళ్లాడు. స్క్రిప్టు బాగుందని చెప్పిన వారంతా తరువాత హ్యాండిచ్చారు.


చివరికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అజయ్ రెండో సినిమాకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్న సమయంలో హీరోయిన్ సమంత డ్రాప్ అయింది. దీనికి కారణం ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి నటించిన  ‘జాను’ ఫలితమే అని సమాచారం. సమంత నో చెప్పడంతో ఈ సినిమా కోసం ‘సమ్మోహనం’ ఫేం అదితి రావ్ హైదరీని తీసుకున్నట్లు తెలిసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకుడు. చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2020-02-16T22:34:40+05:30 IST