మ‌రోసారి బ‌న్నీ పాట‌ను రీమిక్స్ చేస్తున్న స‌ల్మాన్‌

ABN , First Publish Date - 2020-06-08T19:59:55+05:30 IST

గ‌తంలో బ‌న్నీ స్టెప్పులేసిన ‘రింగ రింగ‌..’ పాటను బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ త‌న సినిమా ‘రెఢీ’లో రీమిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌ల్మాన్ మ‌రోసారి బ‌న్నీ పాట‌ను త‌న ‘రాధే’ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్నాడ‌ట‌.

మ‌రోసారి బ‌న్నీ పాట‌ను రీమిక్స్ చేస్తున్న స‌ల్మాన్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్సుల‌కు ప్రేక్ష‌కులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు. గ‌తంలో బ‌న్నీ స్టెప్పులేసిన ‘రింగ రింగ‌..’ పాటను బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ త‌న సినిమా ‘రెఢీ’లో రీమిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌ల్మాన్ మ‌రోసారి బ‌న్నీ పాట‌ను త‌న ‘రాధే’ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ రీమిక్స్‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడ‌ట‌. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‘రాధే’ చిత్రం మే 22న విడుద‌ల కావాల్సింది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. 


Updated Date - 2020-06-08T19:59:55+05:30 IST