ప్రభాస్‌ 'సలార్‌'కు ముహూర్తం కుదిరింది

ABN , First Publish Date - 2020-12-27T00:52:04+05:30 IST

ప్రభాస్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సలార్‌' సినిమా షూటింగ్‌ను షురూ చేయనున్నాడు.

ప్రభాస్‌ 'సలార్‌'కు ముహూర్తం కుదిరింది

'బాహుబలి'తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ 'సాహో' తర్వాత 'రాధేశ్యామ్‌' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్‌, టీసిరీస్‌ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ చేతిలో మూడు ప్యాన్‌ ఇండియా సినిమాలున్నాయి. అందులో ముందుగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సలార్‌' సినిమా షూటింగ్‌ను షురూ చేయనున్నాడు. ఇండస్ట్రీ వర్గాల వివరాల మేరకు జనవరి 18 నుండి 'సలార్‌' షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొనబోతున్నాడట. నాలుగు నెలల పాటు కంటిన్యూగా ఈ సినిమా కోసం ప్రభాస్‌ వర్క్‌ చేయనున్నాడని టాక్‌ వినిపిస్తోంది. దీని తర్వాత ఓంరావుత్‌ దర్శతక్వంలో చేయనున్న 'ఆదిపురుష్‌' ... ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమాలను ప్రభాస్‌ ట్రాక్‌ ఎక్కిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2020-12-27T00:52:04+05:30 IST