ఇద్ద‌రు నిర్మాత‌లతో సాయితేజ్ చిత్రం..?

ABN , First Publish Date - 2020-08-08T18:39:55+05:30 IST

సెంట్‌గా ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ను సాయితేజ్ ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, నిర్మాత దిల్‌రాజు క‌లిసి నిర్మిస్తార‌ని అంటున్నారు.

ఇద్ద‌రు నిర్మాత‌లతో సాయితేజ్ చిత్రం..?

కుర్ర క‌థానాయ‌కుడు సాయితేజ్ వ‌రుస సినిమాల‌ను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్‌లో పెట్టుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా న‌టించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్‌గా ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ను సాయితేజ్ ఓకే చెప్పార‌ట‌. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, నిర్మాత దిల్‌రాజు క‌లిసి నిర్మిస్తార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం తేజు ఫుల్ బిజీగా ఉండ‌టంతో, చేయాల్సిన సినిమాల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాతే ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ చిత్రం 2022లో ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు. 

Updated Date - 2020-08-08T18:39:55+05:30 IST

Read more