మరోసారి నానితో సాయిపల్లవి?

ABN , First Publish Date - 2020-05-26T22:01:19+05:30 IST

నేచురల్ స్టార్ నాని, నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి కలిసి `ఎమ్‌సీఏ` సినిమాలో చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది.

మరోసారి నానితో సాయిపల్లవి?

నేచురల్ స్టార్ నాని, నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి మూడేళ్ల కిందట `ఎమ్‌సీఏ` సినిమాలో చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. తమ సహజ నటనతో ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. త్వరలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. 


నాని త్వరలో చేయబోయే `శ్యామ్‌సింఘరాయ్` సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్రకు సాయిపల్లవి అయితేనే బాగుంటుందని దర్శకడు భావిస్తున్నాడట. త్వరలోనే సాయిపల్లవిని కలిసి కథ వినిపించాలని అనుకుంటున్నారట. సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం`, `లవ్‌స్టోరీ` సినిమాల్లో నటిస్తోంది. 

Updated Date - 2020-05-26T22:01:19+05:30 IST