పీరియాడిక‌ల్ చిత్రంలో సాయితేజ్‌..!

ABN , First Publish Date - 2020-02-27T18:34:05+05:30 IST

గత ఏడాది 'చిత్ర లహరి', 'ప్రతి రోజూ పండగే' చిత్రాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన సాయితేజ్... ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్` సినిమా చేస్తున్నాడు.

పీరియాడిక‌ల్ చిత్రంలో సాయితేజ్‌..!

గత ఏడాది 'చిత్ర లహరి', 'ప్రతి రోజూ పండగే' చిత్రాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన సాయితేజ్... ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్` సినిమా చేస్తున్నాడు. మే 1న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్ కానుంది. ఈ లోపే తేజ్ ఓ పిరియాడిక్ ఫిల్మ్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. 'బిందాస్', 'రగడ' చిత్రాల దర్శకుడు వీరు పోట్ల రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తాడని టాక్. అంతేకాదు... శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వాతావరణంతో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. అలాగే కథానుసారం కొన్ని స్పెషల్ సెట్స్ కూడా వేస్తున్నారని వినికిడి. మరి... ఈ పిరియాడిక్ మూవీ సాయితేజ్ కి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.    


Updated Date - 2020-02-27T18:34:05+05:30 IST