వెబ్ సిరీస్‌లో సాయిపల్లవి?

ABN , First Publish Date - 2020-07-31T22:12:36+05:30 IST

తన నాట్యంతోనూ, అభినయంతోనూ దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేసింది సాయిపల్లవి

వెబ్ సిరీస్‌లో సాయిపల్లవి?

తన నాట్యంతోనూ, అభినయంతోనూ దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేసింది సాయిపల్లవి. గ్లామరస్ పాత్రల్లో నటించకపోయినా సాయిపల్లవికి ఏమాత్రం అవకాశాలు తగ్గడం లేదు. నటనకు అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా సాయిపల్లవిని వెతుక్కుంటూ వస్తోంది. 


ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా దృష్టి సారించిందట. తమిళ ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పిందట. వెట్రిమారన్ సినిమాల తరహాలోనే సామాజిక ఇతివృత్తంతో ఈ వెబ్ సిరీస్ రూపొందనుందట. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారట. 


Updated Date - 2020-07-31T22:12:36+05:30 IST