స్వీటీ సినిమా విడుదల ఆలస్యానికి కారణమేంటి?

ABN , First Publish Date - 2020-02-04T15:16:42+05:30 IST

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అనుష్క సినిమా

స్వీటీ సినిమా విడుదల ఆలస్యానికి కారణమేంటి?

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అనుష్క సినిమా కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇది గమనించిన స్వీటీ తిరిగి ఇప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ముందు ఈ సినిమాను జనవరి 31న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని విడుదల చేయడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేసే అవకాశాలున్నాయ‌ని టాక్ నడుస్తోంది.


అయితే ఈ సినిమాకు బయ్యర్లు దొరకకపోవడంతోనే విడుదల ఆలస్యం అవుతోందన్న మాటలు కూడా వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, స్వీటీ అనుష్క కోసం ఆమె ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో వేచి చూస్తున్నారు.

Updated Date - 2020-02-04T15:16:42+05:30 IST