‘లూసిఫర్’ రీమేక్ ఆగిందా? లేక దర్శకుడు మారుతున్నాడా?

ABN , First Publish Date - 2020-07-19T04:17:43+05:30 IST

చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ‘లూసిఫర్’ రీమేక్ ఉంటుందని, అది తమ్ముడు పవన్ కల్యాణ్ చేస్తానంటే ఇచ్చేస్తాను కానీ.. తమ్ముడు ఈ సినిమా విషయంలో ఇంత

‘లూసిఫర్’ రీమేక్ ఆగిందా? లేక దర్శకుడు మారుతున్నాడా?

చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ‘లూసిఫర్’ రీమేక్ ఉంటుందని, అది తమ్ముడు పవన్ కల్యాణ్ చేస్తానంటే ఇచ్చేస్తాను కానీ.. తమ్ముడు ఈ సినిమా విషయంలో ఇంత వరకు ఏం మాట్లాడలేదని తెలిపారు. అంతేకాదు ఆ చిత్రాన్ని తనే చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ చరణ్ ‘సాహో’ దర్శకుడు సుజీత్ చేతిలో పెట్టారు. తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేయమని సుజీత్‌కు చరణ్ ఈ స్క్రిఫ్ట్‌ను అప్పగించారు. అతను కూడా దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లుగా టాక్ నడిచింది. అయితే సుజీత్ చేతిలో స్క్రిఫ్ట్ మార్పులు జరుగుతున్నప్పుడే ఈ సినిమా గురించి, అందులో నటించే నటీనటుల గురించి రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 


మరి సుజీత్ మార్చిన మార్పులు నచ్చలేదో.. లేదంటే సుజీత్‌పై నమ్మకం లేదో తెలియదు కానీ.. ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు వినాయక్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని, అన్ని కుదిరితే వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు స్టార్ట్ అయ్యాయి. మరి వీటిలో ఏది నిజమే తెలియాలంటే.. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉన్న చిరు ట్వీట్ చేయాల్సిందే.

Updated Date - 2020-07-19T04:17:43+05:30 IST