సమీరా రెడ్డి రీ ఎంట్రీ.. విలన్‌గా కాదు.. మరి?
ABN , First Publish Date - 2020-12-01T01:43:51+05:30 IST
స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన

స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. ఆ తర్వాత పెళ్లి చేసేసుకుని, ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన సమీరా రెడ్డి.. త్వరలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రీఎంట్రీలో ఆమె లేడీ విలన్‌గా కనిపించనుందనే వార్తలు రావడంతో.. ఆ వార్తలపై స్వయంగా సమీరా రెడ్డే క్లారిటీ ఇచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె రీ ఎంట్రీ వార్తలు సద్దుమణిగినప్పటికీ.. తాజాగా మరికొన్ని వార్తలు ఆమె ఎంట్రీపై వినిపిస్తున్నాయి. ఆమె రీ ఎంట్రీ విలన్‌గా కాకుండా.. హోస్ట్‌గా ఇస్తుందట. బాలీవుడ్‌లోని ఓ ఛానెల్‌లో ప్రసారం కాబోయే షోకి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినవస్తున్నాయి. మరి ఈ వార్తలపై సమీరా ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.
Read more