`ఆర్ఆర్ఆర్`.. ఏ స్టేజ్‌లో ఉంది?

ABN , First Publish Date - 2020-12-29T19:36:20+05:30 IST

చకచకా సాగుతున్న `ఆర్ఆర్ఆర్` షూటింగ్‌కు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కారణంగా బ్రేక్ పడింది.

`ఆర్ఆర్ఆర్`.. ఏ స్టేజ్‌లో ఉంది?

చకచకా సాగుతున్న `ఆర్ఆర్ఆర్` షూటింగ్‌కు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కారణంగా బ్రేక్ పడింది. చెర్రీ తాజాగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. గండిపేట సమీపంలో వేసిన భారీ సెట్‌లో ఎన్టీఆర్, చరణ్‌లపై అనేక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది. అయితే చెర్రీకి కరోనా సోకినందువల్ల `ఆర్ఆర్ఆర్` షూటింగ్ మళ్లీ గందరగోళంలో పడింది. 


కరోనా నుంచి కోలుకుని చెర్రీ రావడానికి కనీసం రెండు వారాలైనా పడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌కు `ఆర్ఆర్ఆర్` సినిమా షూటింగ్ పూర్తవుతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమవుతుందట. దాదాపు ఆరు నెలలు దానికి కేటాయించాల్సి ఉంటుందట. దసరా సమయానికి సినిమాను సిద్ధం చేయాలనుకుంటున్నారట. ఒకవేళ కుదరకపోతే వచ్చే సంక్రాంతికి విడుదలను ప్లాన్ చేస్తున్నారట. 

Updated Date - 2020-12-29T19:36:20+05:30 IST