రవితేజ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా?

ABN , First Publish Date - 2020-12-25T20:34:37+05:30 IST

గతేడాది `ప్రతిరోజూ పండగే` సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు మారుతి.

రవితేజ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా?

గతేడాది `ప్రతిరోజూ పండగే` సినిమాతో ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు మారుతి. దాని తర్వాత మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేయాలనుకున్నాడు. రవితేజకు కథ కూడా వినిపించాడు. ఆ కథ నచ్చడంతో రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా ఆగిపోయినట్టు తాజా సమాచారం. 


పారితోషికం విషయంలో తేడా రావడంతో ఆ సినిమా నుంచి రవితేజ తప్పుకున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్‌లో గీతా-2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను ప్లాన్ చేశాయి. అయితే రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతో ఈ సినిమా ముందుకెళ్లలేదట. వేరే హీరోతో ఈ సినిమా చేయడానికి రంగం సిద్ధమవుతోందట. రవితేజ నటించిన `క్రాక్` సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. 

Updated Date - 2020-12-25T20:34:37+05:30 IST