బాలయ్య `నో` చెప్పడంతో రవితేజకు లైన్ క్లియర్?

ABN , First Publish Date - 2020-06-10T15:03:27+05:30 IST

మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పన్ కోషియమ్` సినిమా తెలుగు రీమేక్ విషయంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.

బాలయ్య `నో` చెప్పడంతో రవితేజకు లైన్ క్లియర్?

మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పన్ కోషియమ్` సినిమా తెలుగు రీమేక్ విషయంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ దక్కించుకుంది. బిజూ మీనన్ పోషించిన పాత్రకు బాలకృష్ణను, పృథ్వీరాజ్ పాత్రకు రానాను తీసుకోవాలని అనుకున్నారు. 


ఈ సినిమా విషయమై బాలయ్యను కూడా కలిసినట్టు సమాచారం. అయితే ఈ సినిమా చేయడానికి బాలయ్య అంగీకరించలేదట. బాలయ్య ఒప్పుకోకపోవడంతో రవితేజ లైన్‌లోకి వచ్చినట్టు సమాచారం. ఈ పాత్ర తనకు మంచి మేకోవర్ అవుతుందని రవితేజ అనుకుంటున్నాడట. రవితేజతోపాటు రానా కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట. 

Updated Date - 2020-06-10T15:03:27+05:30 IST