సమంతతో రష్మిక?

ABN , First Publish Date - 2020-08-08T21:44:14+05:30 IST

గ్లామరస్ హీరోయిన్‌గా ఎన్నో కమర్షియల్ విజయాలు అందుకున్న హీరోయిన్ సమంత

సమంతతో రష్మిక?

గ్లామరస్ హీరోయిన్‌గా ఎన్నో కమర్షియల్ విజయాలు అందుకున్న హీరోయిన్ సమంత వివాహం తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల వైపే మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ సమంతకు బాగా నచ్చిందట. 


అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. అందులో అక్క పాత్ర కోసం సమంతను సంప్రదించారట. కథ బాగా నచ్చడంతో సమంత ఆ సినిమాకు ఓకే చెప్పిందట. చెల్లి పాత్రకు మరో హీరోయిన్ రష్మిక పేరును సిఫారసు చేసిందట. ఫోన్ ద్వారా కథ విని రష్మిక కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 


Updated Date - 2020-08-08T21:44:14+05:30 IST

Read more