మరో బాలీవుడ్‌ సినిమాకు ఓకే చెప్పిన రష్మిక మందన్న..!

ABN , First Publish Date - 2020-12-29T01:36:02+05:30 IST

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మాతృభాష కన్నడలోనూ సినిమాలు చేస్తున్న శాండిల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న.. తెలుగులో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను దక్కించుకుంది.

మరో బాలీవుడ్‌ సినిమాకు ఓకే చెప్పిన రష్మిక మందన్న..!

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు మాతృభాష కన్నడలోనూ సినిమాలు చేస్తున్న శాండిల్‌వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న.. తెలుగులో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది సూపరస్టార్‌ మహేశ్‌ సరసన సరిలేరు నీకెవ్వరులో చిత్రంలో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ పుష్పలో నటిస్తుంది. రీసెంట్‌గానే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా చేస్తున్న 'మిషన్‌ మజ్ను' లో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కాకుండా రీసెంట్‌గా మరో బాలీవుడ్‌ సినిమాలోనూ రష్మిక మందన్న నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాలకు విశాల్ భట్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్ ప్రధాన పాత్రలో డెడ్లీ అనే సినిమా రూపొందనుంది. ఇందులో రష్మిక .. అమితాబ్‌ బచ్చన్‌ కుమార్తె పాత్రలో నటించనుందట. వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందని అంటున్నారు. 


Updated Date - 2020-12-29T01:36:02+05:30 IST