అఖిల్ సరసన రష్మిక?

ABN , First Publish Date - 2020-10-14T19:12:45+05:30 IST

సరైన విజయం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్.

అఖిల్ సరసన రష్మిక?

సరైన విజయం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు అక్కినేని యంగ్ హీరో అఖిల్. ప్రస్తుతం `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్న `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించనున్న సినిమాలో అఖిల్ కనిపించనున్నాడు.

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` రూపంలో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన `పుష్ప`లో నటిస్తోంది. సక్సెస్ ట్రాక్ మీద ఉన్న రష్మికను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. 

Updated Date - 2020-10-14T19:12:45+05:30 IST