హిందీ 'ఇస్మార్ట్ శంకర్' ఎవరంటే..?
ABN , First Publish Date - 2020-10-05T18:54:47+05:30 IST
మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కూడా చేరిందట. ఆ సినిమా ఏదో కాదు..'ఇస్మార్ట్ శంకర్'.

తెలుగు చిత్రాలను బాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేయడం ఈమధ్య ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రీమేక్ కోవలో మరో టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కూడా చేరిందట. ఆ సినిమా ఏదో కాదు..'ఇస్మార్ట్ శంకర్'. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉన్న రామ్‌కు మాస్ ఇమేజ్‌ను తేవడమే కాదు.. ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను మళ్లీ హిట్ ట్రాక్‌లోకి తీసుకొచ్చిన చిత్రమిది. నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామర్ ఇమేజ్‌తో పాటు మణిశర్మకు మ్యూజిక్ డైరెక్టర్‌గా మళ్లీ క్రేజ్‌ను తీసుకొచ్చిన చిత్రమిది. సూపర్‌డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ భావిస్తుందట. ఇందులో రణ్వీర్ సింగ్‌ను హీరోగా నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ రీమేక్ దర్శకుడు ఎవరనే దానిపై కూడా క్లారిటీ వస్తుందని సమాచారం.