మెగా హీరో సినిమాలో రానా..!

ABN , First Publish Date - 2020-10-21T14:07:46+05:30 IST

డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తోన్న చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

మెగా హీరో సినిమాలో రానా..!

మెగా క్యాంప్ హీరోల్లో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న వైష్ణ‌వ్ తేజ్ త‌న తొలి చిత్రం విడుద‌ల కాక‌ముందే మరో సినిమాలో న‌టించేస్తున్నాడు. డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తోన్న చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఓ అతిథి పాత్ర‌లో టాలీవుడ్ హ‌ల్క్ రానా ద‌గ్గుబాటి న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. డైరెక్ట‌ర్ క్రిష్‌తో ఉన్న అనుబంధంతో రానా కూడా ఈ సినిమాలో గెస్ట్ పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పాడ‌ని టాక్‌. 

Updated Date - 2020-10-21T14:07:46+05:30 IST