చిరంజీవి సినిమాలో రమ్యకృష్ణ?

ABN , First Publish Date - 2020-09-29T22:56:09+05:30 IST

మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపుతున్నారు.

చిరంజీవి సినిమాలో రమ్యకృష్ణ?

మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్`ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించబోతున్నట్టు సమాచారం. మలయాళంలో ప్రముఖ నటి ముంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణ చేత చేయించాలని వినాయక్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయమై రమ్యకృష్ణను వినాయక్ కలవబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-29T22:56:09+05:30 IST