నెగిటివ్‌ రోల్‌లో రమ్యకృష్ణ.. సాయితేజ్‌ తట్టుకోగలడా?

ABN , First Publish Date - 2020-10-28T01:11:25+05:30 IST

మెగా హీరో సాయితేజ్‌ హీరోగా దేవాకట్ట దర్శకత్వంలో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం పొలిటికల్‌

నెగిటివ్‌ రోల్‌లో రమ్యకృష్ణ.. సాయితేజ్‌ తట్టుకోగలడా?

మెగా హీరో సాయితేజ్‌ హీరోగా దేవాకట్ట దర్శకత్వంలో ఓ సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్‌తో పాటు 'రిపబ్లిక్‌' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శివగామి రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించనుందనే టాక్‌ కూడా వచ్చింది‌. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ చేయబోయే రోల్‌ గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో రమ్యకృష్ణ నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందట. దేవ కట్టా ప్రస్థానం చిత్రంలోని సాయికుమార్‌ పాత్రలా ఆమె పాత్ర ఉంటుందని అంటున్నారు. నీలాంబరిగా నరసింహ చిత్రంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కి, శివగామిగా బాహుబలిలో ప్రభాస్‌కి ధీటుగా నిలబడిన రమ్యకృష్ణ.. ఈ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ చేస్తుంది అనగానే సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇదే నా మాట.. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ గర్జిస్తే.. ఆమె ముందు సాయితేజ్‌ నిలబడగలడా? అనే డౌట్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతుండటం విశేషం. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated Date - 2020-10-28T01:11:25+05:30 IST