ఆర్ఆర్ఆర్: రామ్‌చరణ్ లుక్ వస్తోందా?

ABN , First Publish Date - 2020-02-21T20:57:33+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`.

ఆర్ఆర్ఆర్: రామ్‌చరణ్ లుక్ వస్తోందా?

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఆ సినిమాలో ఎన్టీయార్ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీయార్‌కు సంబంధించిన లుక్ లీకైంది. అలాగే పులితో ఎన్టీయార్ ఫైట్ వీడియో కూడా లీకైంది. 


చెర్రీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వార్తా బయటకు రాలేదు. సినిమాలో చెర్రీ లుక్ ఎలా ఉంటుందో రివీల్ కాలేదు. దీంతో చెర్రీ లుక్‌ను త్వరలో విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందట. వచ్చే నెలలో రామ్‌చరణ్ బర్త్‌డే ఉంది. ఆ సందర్భంగా `ఆర్ఆర్ఆర్`లో చెర్రీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. మరి, మెగా ఫ్యాన్స్ అప్పటివరకు వెయిట్ చేయకతప్పదు. 

Updated Date - 2020-02-21T20:57:33+05:30 IST