వర్మ సైలెంట్‌గా ఉన్నాడేంటి అనుకుంటున్నారా?

ABN , First Publish Date - 2020-03-04T02:46:38+05:30 IST

గత కొంత కాలంగా తన కొత్త సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ నోరు మెదపడం లేదు. సాధారణంగా వెంట వెంటనే సినిమాలు చేయడం, వాటి వివరాలు

వర్మ సైలెంట్‌గా ఉన్నాడేంటి అనుకుంటున్నారా?

గత కొంత కాలంగా తన కొత్త సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ నోరు మెదపడం లేదు. సాధారణంగా వెంట వెంటనే సినిమాలు చేయడం, వాటి వివరాలు బయటపెట్టడం వర్మకు అలవాటు. కానీ దానికి భిన్నంగా వర్మ తన కొత్త సినిమా విషయాలు బయట పెట్టలేదు. ఆ మధ్య దిశా సంఘటన ఆధారంగా సినిమా తీస్తానని అన్నారు గానీ దాని గురించిన విషయాలు బయటకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమా విషయంలో వర్మ స్పీడు పెంచాడంటున్నారు సినీ జనాలు. దిశా సంఘటన కేసుకు సంబంధించి పరిశోధన ప్రారంభించేశారు. సంఘటన వివరాలు, ఎన్‌కౌంటర్‌ నిందిత కుటుంబ సభ్యులను కలుసుకున్నారట. సినిమా స్ర్కిప్టు పనులు కూడా ప్రారంభించారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వర్మ తెలియజేయనున్నాడట.

Updated Date - 2020-03-04T02:46:38+05:30 IST

Read more