చరణ్ తదుపరి దర్శకుడెవరంటే..?
ABN , First Publish Date - 2020-03-04T20:06:27+05:30 IST
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తాడనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తాడనే దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. చరణ్ తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన పలు ప్రముఖ దర్శకుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లేటెస్ట్ సమాచారం మేరకు కొరటాల శివ..రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చిరు 153 సినిమా నిర్మాణంలో బిజీ అవుతాడట. ఆలోపు కొరటాల చిరు 152ని పూర్తి చేయడంతో పాటు స్క్రిప్ట్‌ను తయారు చేసుకుంటాడట. సినిమా వర్గాల వార్తల ప్రకారం వీరివురి కలయికలో సినిమా ఫిబ్రవరి నుండి ప్రారంభం అవుతుందని టాక్.
Read more