మ‌రో రీమేక్‌పై కన్నేసిన చర‌ణ్‌?

ABN , First Publish Date - 2020-02-18T15:45:06+05:30 IST

హీరోగానే కాదు.. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150తో నిర్మాత‌గా కూడా మారారు రామ్‌చ‌ర‌ణ్‌.

మ‌రో రీమేక్‌పై కన్నేసిన చర‌ణ్‌?

హీరోగానే కాదు.. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150తో నిర్మాత‌గా కూడా మారారు రామ్‌చ‌ర‌ణ్‌. అప్ప‌టి నుండి ఆయ‌న‌తోనే సినిమాలు చేస్తున్నాడు. సైరా న‌ర‌సింహారెడ్డి నిర్మించిన త‌ర్వాత ఇప్పుడు చిరు, కొర‌టాల శివ సినిమాకు చ‌ర‌ణ్ నిర్మాణంలో భాగ‌స్వామిగా ఉన్నారు. అలాగే చిరంజీవి 153వ సినిమాగా మలయాళంలో సూపర్ హిట్ట‌యిన లూసిఫ‌ర్ సినిమాను చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నాడు. కాగా.. ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌రో మ‌ల‌యాళ సినిమాను రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ చిత్ర‌మేదో కాదు.. డ్రైవింగ్ లైసెన్స్‌. ఈ సినిమాను మెగా క్యాంప్ హీరోల‌తో రీమేక్ చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నట్లు టాక్‌. 


Updated Date - 2020-02-18T15:45:06+05:30 IST