ఆర్ఆర్ఆర్: రాజమౌళి టెస్ట్ షూట్?

ABN , First Publish Date - 2020-06-12T23:17:14+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్: రాజమౌళి టెస్ట్ షూట్?

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. కరోనా ఈ సినిమా షూటింగ్‌కు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా సెట్స్‌లో రోజూ వందల మంది ఉండాల్సి వస్తుంది. అయితే 50 మందికి మించకూడదని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. 


ఈ నేపథ్యంలో 50మందితో రాజమౌళి టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. తక్కువ మందితో ఎలా షూటింగ్ చేయాలి? కరోనా వ్యాప్తి చెందుకుండా నిబంధనలు ఎలా పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి ఈ టెస్ట్ షూట్‌లో పరిశీలిస్తారట. సోమవారం ఈ టెస్ట్ షూట్ జరగబోతోందని సమాచారం. 

Updated Date - 2020-06-12T23:17:14+05:30 IST