ప్రభాస్, మహేశ్‌ల‌తో రాజ‌మౌళి భారీ మల్టీస్టారర్?

ABN , First Publish Date - 2020-02-14T19:56:48+05:30 IST

సినిమా సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ పోతున్న ఆ డైరెక్టర్.. ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైన వెంటనే దానిని మించిన రీతిలో మరో మల్టీస్టారర్‌కి ప్లాన్ వేస్తున్నాడట

ప్రభాస్, మహేశ్‌ల‌తో రాజ‌మౌళి భారీ మల్టీస్టారర్?

సినిమా సినిమాకీ రేంజ్ పెంచుకుంటూ పోతున్న ఆ డైరెక్టర్.. ప్రస్తుతం ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తైన వెంటనే దానిని మించిన రీతిలో మరో మల్టీస్టారర్‌కి ప్లాన్ వేస్తున్నాడట. సినిమా విజయానికి కావాల్సిన సూత్రాలన్నీ ఒడిసిపట్టుకున్న రాజమౌళి.. అపజయమెరుగని దర్శకుడిగా ఖ్యాతి పొందాడు. ఒక సినిమాకి మించి మరొక చిత్రం తీస్తూ.. అభిమానుల అంచనాలను అందుకోవడంలో సఫలీకృతుడవుతున్నాడు. ఇక.. 'బాహుబలి' భారీ విజయం తర్వాత.. 'ఆర్.ఆర్.ఆర్'తో బిజీ అయ్యాడు జక్కన్న. 'బాహుబలి' సిరీస్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో 'ట్రిపుల్ ఆర్' తెరకెక్కుతుంది.


ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఎన్టీఆర్-రామ్‌ చరణ్ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'.. వచ్చే యేడాది సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. అయితే.. లేటెస్ట్‌గా రాజమౌళి నెక్స్ట్‌ మూవీపై ఓ న్యూస్ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. తన తదుపరి సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్'కి మించిన మరో మల్టీస్టారర్‌ రూపొందించేందుకు కసరత్తులు మొదలుపెట్టాడట జక్కన్న. నిజానికి మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది. కె.ఎల్.నారాయణ ఆ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే మహేశ్‌ బాబుతో పాటు తన తర్వాతి సినిమా కోసం ప్రభాస్‌ని కూడా లైన్లో పెడుతున్నాడట. 'ఆర్.ఆర్.ఆర్'కి మించిన రీతిలో మహేశ్-ప్రభాస్‌తో భారీ మల్టీస్టారర్‌కి ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. 'బాహుబలి', 'ఆర్.ఆర్.ఆర్' తరహాలో పీరియాడికల్ వార్ డ్రామాగా ఉంటుందట. కె.ఎల్.నారాయణతో పాటు యు.వి.క్రియేషన్స్‌ కూడా ఆ ప్రాజెక్టుకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు టాక్. ఇందులో నిజానిజాలేంటన్నది పక్కన పెడితే... 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత రాజమౌళి నెక్స్ట్‌ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూద్దాం.

Updated Date - 2020-02-14T19:56:48+05:30 IST