మ‌ల‌యాళ రీమేక్‌లో రాజ‌శేఖ‌ర్‌..!

ABN , First Publish Date - 2020-06-12T15:19:33+05:30 IST

‘క‌ల్కి’ సినిమా త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ మ‌రో చిత్రంలో న‌టించలేదు. అయితే ఆయ‌న త్వ‌ర‌లోనే ఓ రీమేక్ సినిమాలో నటించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మ‌ల‌యాళ రీమేక్‌లో రాజ‌శేఖ‌ర్‌..!

‘క‌ల్కి’ సినిమా త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ మ‌రో చిత్రంలో న‌టించలేదు. అయితే ఆయ‌న త్వ‌ర‌లోనే ఓ రీమేక్ సినిమాలో నటించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స‌మాచారం మేర‌కు మ‌ల‌యాళంలో 2018లో విడుద‌లై విజ‌య‌వంత‌మైన ‘జోసెఫ్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి హ‌క్కుల‌ను గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ గీతాఆర్ట్స్ 2 ద‌క్కించుకుంద‌ట‌. మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో రాజ‌శేఖ‌ర్ ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ట‌. ‘ప‌లాస 1978’ చిత్రంతో హిట్ సాధించిన క‌రుణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. 

Updated Date - 2020-06-12T15:19:33+05:30 IST