రామ్ చరణ్ ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో హీరో ఎవరంటే?
ABN , First Publish Date - 2020-08-08T03:05:16+05:30 IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. రామ్ చరణ్‌లో దాగి వున్న నటుడిని పరిచయం చేశాడు సుకుమార్. ఈ చిత్రం విడుదల తర్వాత విమర్శకుల ప్రశంసలే కాదు.. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన ఈ సినిమాకి మెయిన్ హైలెట్. అలాగే సమంత నటన కూడా. అయితే ఈ చిత్రం త్వరలో తమిళ్‌లో రీమేక్ కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్ర తమిళ రీమేక్‌లో రామ్ చరణ్, సమంత పాత్రలలో ఎవరెవరు నటించబోతున్నారో కూడా తెలుపుతూ కోలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. హర్రర్ చిత్రాల దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ‘రంగస్థలం’ చిత్రంలోని చిట్టిబాబు అదే రామ్ చరణ్ పాత్రలో నటించనున్నారని, అలాగే సమంత పాత్రకు సంజన సోదరి నిక్కీ గల్రాణీని సెలక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నారట. అయితే హర్రర్ చిత్రాలతో మెప్పించిన రాఘవ లారెన్స్ చెవిటివాడిగా ఎలా ఆకట్టుకుంటాడా అనేదే కోలీవుడ్ మీడియా కథనాలలో ఇప్పుడు ఆసక్తికరంగా వినబడుతోంది.