స్టార్‌ హీరో జతగా రాశీఖన్నా..!

ABN , First Publish Date - 2020-12-01T16:06:45+05:30 IST

యాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి

స్టార్‌ హీరో జతగా రాశీఖన్నా..!

తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ఇప్పుడు క్రమంగా తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌ సమాచారం మేరకు రాశీఖన్నాకు మరో భారీ ఆఫర్‌ వచ్చింది. సినీ వర్గాల సమాచారం మేరకు..చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇంతకు ముందు విక్రమ్‌, హరి కాంబినేషన్‌లో సామి, స్వామిస్క్వేర్‌ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి వీరి కలయికలో సినిమా తెరకెక్కనుంది. నిజానికి హీరో సూర్య, హరి కాంబినేషన్‌లో అరువా అనే సినిమా రూపొందుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌ టేకాఫ్‌ కాలేదు. దీంతో హీరో విక్రమ్‌తో సినిమా చేయడానికి డైరెక్టర్‌ హరి సిద్ధమయ్యారు. 


Updated Date - 2020-12-01T16:06:45+05:30 IST

Read more