ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ చిత్రం..!

ABN , First Publish Date - 2020-07-19T17:28:46+05:30 IST

బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ సౌత్ రీమేక్‌. కంగనా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మ‌న కుమర‌న్ నిర్మించారు. తెలుగు వెర్ష్‌న్‌గా రూపొందిన ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా, తమిళ వెర్షన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ అగర్వాల్, కన్నడ వెర్షన్‌లో పారుల్ యాద‌వ్‌, మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో మంజిమ మోహ‌న్ లీడ్ రోల్స్‌లో న‌టించారు.

ఓటీటీలో త‌మ‌న్నా, కాజ‌ల్ చిత్రం..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందని స‌మాచారం. అదేంటి?  వీరిద్ద‌రూ ఓ సినిమాలో క‌లిసి ఎప్పుడు న‌టించారు? అనే సందేహం సినీ ప్రేక్ష‌కుడికి రాక మాన‌దు. నిజానికి వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌లేదు. కానీ.. వీరిద్ద‌రూ ఓ సినిమా రీమేక్‌లో వేర్వేరు వెర్ష‌న్స్‌లో మెయిన్ లీడ్‌ను పోషించారు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల కానుంది. ఆ సినిమా ఏదో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ సౌత్ రీమేక్‌. కంగనా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మ‌న కుమర‌న్ నిర్మించారు. తెలుగు వెర్ష్‌న్‌గా రూపొందిన ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా, తమిళ వెర్షన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ అగర్వాల్, కన్నడ వెర్షన్‌లో పారుల్ యాద‌వ్‌, మ‌ల‌యాళ వెర్ష‌న్‌లో మంజిమ మోహ‌న్ లీడ్ రోల్స్‌లో న‌టించారు. ఈ సినిమా విడుద‌ల వాయిదాల మీద వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌ర్వ‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. 

Updated Date - 2020-07-19T17:28:46+05:30 IST