‘పుష్ప’ పాటల ప్లానింగ్

ABN , First Publish Date - 2020-06-15T19:40:14+05:30 IST

లుక్ ప‌రంగా సిద్ధ‌మై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేయాల‌ని అనుకున్నాడు అల్లు అర్జున్.

‘పుష్ప’ పాటల ప్లానింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ‘అల వైకుంఠ‌పుర‌ములో’తో భారీ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. కాస్త గ్యాప్ తీసుకుని లుక్ ప‌రంగా సిద్ధ‌మై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేయాల‌ని అనుకున్నాడు అల్లు అర్జున్. అయితే క‌రోనా ప్ర‌భావంతో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇప్పుడు ప్ర‌భుత్వాలు షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చాయి. ఈ క్ర‌మంలో ‘పుష్ప’ టీమ్ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటుంద‌ట‌. అయితే సాధార‌ణంగా రెండు వంద‌ల మందిలో చేయాల్సిన షూటింగ్‌ను ప్ర‌భుత్వం న‌ల‌బై మందితో పూర్తి చేయ‌మ‌ని ఆదేశాలిచ్చింది. దీంతో ముందుగా పాట‌ల‌ను చిత్రీక‌రించాల‌ని బ‌న్నీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇప్పటికే ట్యూన్స్ సిద్ధమై ఉండటంతో ఇదే బెటర్ అని అందరూ భావిస్తున్నారట. 

Updated Date - 2020-06-15T19:40:14+05:30 IST