పూరి స్క్రిప్ట్‌లో మార్పులు..?

ABN , First Publish Date - 2020-06-16T17:59:49+05:30 IST

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

పూరి స్క్రిప్ట్‌లో మార్పులు..?

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబై బ్యాక్‌డ్రాప్‌లో కొంత మేరకు చిత్రీకరణ జరిగింది. ఈలోపు కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో సినిమా షూటింగ్‌ను ఆపేశారు. ఈ సినిమాలో విజయ్ మార్షల్ ఫైటర్ పాత్రలో కనపడతాడు. విదేశీ ఫైటర్స్‌తో ఫైట్స్ కూడా ఉండేలా పూరి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు విదేశీయులతో షూటింగ్స్ చేయాలని చిత్ర యూనిట్ భావించడం లేదు. దీంతో పూరి ఫారిన్ షెడ్యూల్, ఫారిన్ ఫైటర్స్‌తో ఫైటింగ్ సన్నివేశాలను స్క్రిప్ట్‌లో మార్చుకున్నాడని టాక్.

Updated Date - 2020-06-16T17:59:49+05:30 IST