పూరీ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరు?

ABN , First Publish Date - 2020-04-02T18:54:05+05:30 IST

ఇటీవల `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

పూరీ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరు?

ఇటీవల `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` సినిమాను రూపొందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. 


ఈ లాక్‌డౌన్ సమయంలో తను ఓ స్టార్ హీరో కోసం కథ రాస్తున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ చెప్పాడు. `ఫైటర్` తర్వాత ఆయనతో సినిమాను రూపొందిస్తానని చెప్పాడు. పూరీ ప్రస్తుతం కథ రాస్తోంది నందమూరి బాలకృష్ణ కోసమేనని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో `పైసా వసూల్` చిత్రం వచ్చింది. అయితే ఆ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో బాలయ్యకు మంచి విజయాన్ని అందించాలనే కృతనిశ్చయంతో పూరీ ఉన్నాడట. బాలయ్య కూడా పూరీతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారట. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 


Updated Date - 2020-04-02T18:54:05+05:30 IST