పూరీ చెప్పిన స్టార్ హీరో అతనేనా?

ABN , First Publish Date - 2020-05-25T16:33:46+05:30 IST

గతేడాది `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.

పూరీ చెప్పిన స్టార్ హీరో అతనేనా?

గతేడాది `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓ స్టార్ హీరోతో పని చేయబోతున్నట్టు పూరీ వెల్లడించాడు. 


ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఛార్మి కూడా ఇదే విషయం చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయ్ సినిమా తర్వాత పూరీ తెరకెక్కించబోయేది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిత్రమని తెలుస్తోంది. సల్మాన్ కోసం పూరీ ఓ మాస్ కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం సల్మాన్‌తో ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సల్మాన్ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగానే ఉన్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-05-25T16:33:46+05:30 IST

Read more