విజయ్, పూరి మూవీ షిఫ్టింగ్ టు హైదరాబాద్

ABN , First Publish Date - 2020-05-13T16:15:31+05:30 IST

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లైగ‌ర్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

విజయ్, పూరి మూవీ షిఫ్టింగ్ టు హైదరాబాద్

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ‘లైగ‌ర్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే విజయ్‌కి జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభ‌మైంది. కొంత మేర‌కు షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. ముంబైలో క‌రోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువ‌గా ఉంది. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ షెడ్యూల్‌లో మిగిలిన భాగాన్ని హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. హైద‌రాబాద్‌లో సెట్ వేసి చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌బోయే ఈ సినిమా నిర్మాణంలో పూరి, ఛార్మిల‌తో పాటు క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌మై ఉన్నారు.

Updated Date - 2020-05-13T16:15:31+05:30 IST