హీరోయిన్లతో పోటీకి సై అంటోన్న ఆంటీ

ABN , First Publish Date - 2020-02-12T04:44:35+05:30 IST

ఇప్పటి వరకూ సెక్సీగా, గ్లామర్‌గా కనిపించడం హీరోయిన్లకే చెల్లింది. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కేవలం హీరోయిన్లే కాదు, కేరక్టర్‌ ఆర్టిస్టులూ, ఆంటీలు కూడా

హీరోయిన్లతో పోటీకి సై అంటోన్న ఆంటీ

ఇప్పటి వరకూ సెక్సీగా, గ్లామర్‌గా కనిపించడం హీరోయిన్లకే చెల్లింది. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కేవలం హీరోయిన్లే కాదు, కేరక్టర్‌ ఆర్టిస్టులూ, ఆంటీలు కూడా గ్లామర్‌గా కనిపించడానికి రెడీ అవుతున్నారు. వారిలో ఓ అడుగు ముందుంది ప్రగతి. ఈ నటి తెర మీద అమ్మా, వదిన, పాత్రలు ఎక్కువగా చేస్తుంది. తెర మీద కొద్దిగా పద్ధతిగా కనిపించినా, బయట మాత్రం అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయదు. పచ్చబొట్టు వేయించుకోవడం కామన్‌. కానీ దాన్ని బయటకు చూపించుకోవడం ఇప్పటి ఫ్యాషన్‌. దాన్ని ఫాలో అయిపోతూ, ఇటీవల ఓ ఫోటో పోస్ట్‌ చేసింది.


భుజానికి కొద్దిగా కిందుగా టాటూ వేయించుకుంది ప్రగతి. దాన్ని అందరికీ చూపించాలన్న తహతహతో స్లీవ్‌లెస్‌ జాకెట్‌ వేసుకుని మరీ ఓ కార్యక్రమానికి హాజరైంది. కొందరికి ప్రగతి చేసిన పని నచ్చితే మరికొందరికి అస్సలు నచ్చలేదు.

Updated Date - 2020-02-12T04:44:35+05:30 IST