ప్రదీప్ పెళ్లి ఫిక్సయిందా?

ABN , First Publish Date - 2020-09-29T18:57:43+05:30 IST

ప్రదీప్ మాచిరాజు.. తెలుగు బుల్లితెర పాపులర్ యాంకర్.

ప్రదీప్ పెళ్లి ఫిక్సయిందా?

ప్రదీప్ మాచిరాజు.. తెలుగు బుల్లితెర పాపులర్ యాంకర్. చాలా మంది మేల్ యాంకర్లు ఉన్నప్పటికీ తనదైన శైలిలో స్పాంటేనిటీతో నవ్వులు పూయిస్తూ ప్రదీప్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ బ్యాచిలర్‌గానే ఉన్న ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి. పెళ్లి నేపథ్యంలో ప్రదీప్‌ తనపై తానే స్వయంగా బోలెడు పంచ్‌లు వేసుకున్నాడు. 


ప్రదీప్ తన బ్యాచిలర్ జీవితానికి త్వరలో ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నాడట. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె, యంగ్ పొలిటీషియన్‌ను ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడట. మరో మూడు నెలల్లో ఈ పెళ్లి జరుగబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయాలని ప్రదీప్ అనుకుంటున్నాడట. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ స్పందించే వరకు ఆగాల్సిందే. 

Updated Date - 2020-09-29T18:57:43+05:30 IST